: నవదీప్, తరుణ్ ల పబ్ లలో కొత్త డ్రగ్... కోడ్ చెబితేనే సరఫరా!


నవదీప్, తరుణ్ లకు చెందిన పబ్ లలో సరికొత్త డ్రగ్ డ్రింక్ వినియోగంలో ఉందని సిట్ అధికారులు గుర్తించారు. నవదీప్ కు చెందిన బీపీఎం, తరుణ్ కు చెందిన ఆన్ పబ్ లలో మాత్రమే ఈ డ్రింక్ వినియోగంలో ఉందని తెలుస్తోంది. ఈ డ్రింక్ ను ఎవరికి పడితే వారికి ఇవ్వరని, దీని కోడ్ చెబితే మాత్రమే ఇస్తారని గుర్తించారు. ఈ డ్రింక్ తీసుకున్న 8 గంటల వరకు దాని మత్తు నుంచి బయటకు రావడం కష్టం.

దీనిని కెల్విన్ సహచరుడు జిషాన్ అలియాస్ జాక్ తయారు చేస్తాడని, ఈ డ్రింక్ ను నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేయలేని వారి కోసం తయారు చేస్తారని సమాచారం. దీనిని 'జాక్ క్రాక్ డ్రింక్' గా పిలుస్తారు. కాగా, ఈ విషయాన్ని డ్రగ్ సరఫరా దారు బ్రెండన్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈవెంట్ మేనేజర్ గా బడాబాబుల ఈవెంట్ల ఏర్పాట్లను నవదీప్ నేరుగా చూసుకుంటాడని బ్రెండన్ తెలిపినట్టు సమాచారం. అంతే కాకుండా నవదీప్ ఈవెంట్ మేనేజర్ గా కొకైన్ ను సరఫరా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవదీప్ విచారణ మరింత కీలకంగా మారుతోంది. 

  • Loading...

More Telugu News