: నవదీప్ కీలకం... అతని విచారణ చాలా ముఖ్యం: సిట్ అభిప్రాయం


డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ యువనటుడు నవదీప్ ను నేడు సిట్ విచారించనున్న సంగతి తెలిసిందే. నేటి విచారణ చాలా కీలకమైనదని సిట్ భావిస్తోంది. గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన నవదీప్ పేరు డ్రగ్స్ వ్యవహారంలో మార్మోగిపోయింది. నవదీప్ కు పబ్ ఉందని, పార్టీయింగ్ ను నవదీప్ చాలా ఇష్టపడతాడని ప్రచారం జరిగింది. బీపీఎం పబ్ లో నవదీప్ భాగస్వామి అని, కెల్విన్ లాగే నవదీప్ కూడా ఈవెంట్ మేనేజర్ అని తెలుస్తోంది.

దేశ విదేశాల్లో నవదీప్ ఈవెంట్లు నిర్వహిస్తుంటాడని, అతని పబ్ లోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదని, రేవ్ పార్టీలు కూడా జరుగుతుంటాయని వస్తున్న ఆరోపణలపై సిట్ అధికారులు మరిన్ని కీలక విషయాలు తెలుసుకోనున్నారు. ఈవెంట్ మేనేజర్ గా డ్రగ్ డీలర్లతో ఎలా డీల్స్ చేసుకుంటారు? ఎవరెవరు ఈ దందాలో ఉన్నారు? గోవా నుంచే డ్రగ్స్ వస్తాయా? ఇతర మార్గాల ద్వారా చేరుతుంటాయా? డ్రగ్స్ ను ఎవరు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు? డ్రగ్స్ తీసుకుంటారనే విషయాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? వంటి వివరాలన్నీ నవదీప్ నుంచి సిట్ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. దీంతో నవదీప్ విచారణ చాలా కీలకమైనదని వారు అభిప్రాయపడుతున్నారు. 

  • Loading...

More Telugu News