: అందుకే, జగపతిబాబుతో చాలా సినిమాల్లో నటించలేకపోయాను: నటి ఆమని
వెండితెరపై చూడచక్కని నాటి జంట జగపతిబాబు-ఆమని. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన శుభలగ్నం, మావిచిగురు చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమనికి పెళ్లయిన తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇన్నాళ్లకు జగతిపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘పటేల్ సర్’ చిత్రంలో మళ్లీ ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ, ‘నేను పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నాను. దీంతో, జగపతిబాబుతో కలిసి మళ్లీ సినిమాల్లో నటించలేకపోయాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే... మంచి పాత్ర లభించింది. గతంలో నేను చేసిన శుభలగ్నం, మావిచిగురు సినిమాల్లో పోషించిన పాత్రలకూ.. పటేల్ సర్ చిత్రంలో చేసిన పాత్ర పూర్తిగా విభిన్నం..డిఫరెంట్ గా ఉంది. ఎక్కువ మేకప్ కాకుండా లైట్ మేకప్ తో నేను అందంగా ఉంటానని చాలా మంది అంటుంటారు’ అని ఆమని చెప్పుకొచ్చింది.