: టీమిండియాకు కన్సల్టెంట్ గానా?... ఆక్కర్లేదన్న రాహుల్ ద్రావిడ్
అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తరువాత భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి ఎన్నికైన వేళ, టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను తొలుత ప్రకటించి, ఆపై శాస్త్రి ఒత్తిడితో వెనక్కు తగ్గి, విదేశీ పర్యటనలకు ఆయన కన్సల్టెంట్ గా ఉంటారని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ను రాహుల్ ద్రావిడ్ తిరస్కరించాడు. టీమిండియాకు తాను కన్సల్టెంట్ గా ఉండలేనని ఆయన తేల్చి చెప్పినట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు.
ఇక జహీర్ ఖాన్ కాంట్రాక్టు విషయం ఇంకా తేలలేదని ఆయన అన్నారు. ద్రవిడ్ భారత ఏ టీమ్ కు, అండర్ 19 టీమ్ కు మాత్రమే కొనసాగుతూ ఉంటారని, సీనియర్ టీమ్ తో విదేశాలకు వెళ్లే ఉద్దేశం, ఆలోచన లేవని బీసీసీఐ అధికారులతో జరిగిన సమావేశంలో రాయ్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం జరిగే అండర్ 19 వరల్డ్ కప్ పోటీలకు ద్రవిడ్ శిక్షణలో పిల్లల టీమ్ చక్కగా సన్నద్ధమవుతోందని తెలిపారు.