: మియాపూర్ భూ కుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికే.. డ్రగ్స్ కేసును బయటకు తీశారు: వీహెచ్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే... డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీశారని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ వినియోగం పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం నేర్పుతారని అన్నారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డిని అన్యాయంగా ఇరికించారని వీహెచ్ మండిపడ్డాడు. చనిపోయిన వ్యక్తి భార్య, పిల్లలు కూడా రాజేందర్ రెడ్డి పేరు చెప్పలేదని అన్నారు. పోలీసులపై తమకు ఇంకా నమ్మకం ఉందని... ఛార్జ్ షీట్ నుంచి రాజేందర్ రెడ్డి పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.