: డ్రగ్స్ వ్యవహారం: హీరో తరుణ్ రక్త నమూనా, తల వెంట్రుకలు, గోళ్లు సేకరించడానికి వచ్చిన వైద్యులు
టాలీవుడ్‌లో అలజడి రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈ రోజు సిట్ అధికారులు హీరో తరుణ్‌ని ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. తరుణ్ నుంచి రక్త నమూనా, తల వెంట్రుకలు, గోళ్లు సేకరించడానికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైద్యులు వచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో తరుణ్ కి సంబంధం ఉన్నట్లు తెలుపుతున్న పలు ఆధారాలను తమ వద్ద ఉంచుకుని సిట్ అధికారులు ఆయన నుంచి మరిన్ని విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ మరో గంటసేపు సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యాం కె.నాయుడు, సుబ్బరాజులను అధికారులు ప్రశ్నించారు. ఎల్లుండి నటుడు నవదీప్‌ని విచారించనున్నారు.