: 102వ సినిమా కోసం 30 రోజులపాటు బాలకృష్ణ షూటింగ్!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమాగా 'పైసా వసూల్' చేసిన బాలకృష్ణ, తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఆయన 102వ సినిమా సి.కల్యాణ్ నిర్మాణంలో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, ఆగస్టు 3వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు నిర్మాత సి.కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఆగస్టు 3వ తేదీన మొదలయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ .. 30 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. భారీ బడ్జెట్ తో .. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుందనీ, ప్రకాశ్ రాజ్ .. జగపతిబాబు ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారని చెప్పారు.