: బుల్లితెర రారాజు రానా.. తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ రేటింగ్ సాధించిన రానా షో!


'బాహుబలి' సినిమాతో బాగా పాప్యులర్ అయిన హీరో రానా.... 'నెంబర్ 1 యారీ' అనే టీవీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పలువురు సెల్రబిటీలను షోకు ఆహ్వానిస్తూ, షోలో వారిని వెరైటీ ప్రశ్రలు అడుగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంజాయ్ మెంట్ అందిస్తున్నాడు. దీంతో, ఈ షోను చూడ్డానికి ప్రేక్షకులు అమితమైన ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన తొలి తెలుగు షోగా రాణా షో అవతరించింది. ఈ విషయాన్ని షో నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా షోను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు రానా అభినందనలు తెలిపాడు. 

  • Loading...

More Telugu News