: ఈ రోజు ఉదయం గుడికి వెళ్లిన హీరో తరుణ్!
హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సినీ నటుడు తరుణ్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అంతకు ముందు ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన తరుణ్ మార్గమధ్యంలో గుడికి వెళ్లి దేవుడుకి దండం పెట్టుకున్నాడు. ఈ రోజు సిట్ కార్యాలయానికి తరుణ్ తన తండ్రితో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. తన ఇంటి నుంచి కారులో జూబ్లీహిల్స్ 12 వద్దకు రాగానే అక్కడ ఓ గుడి కనిపించింది. దీంతో అక్కడే కారుని ఆపి తరుణ్ ఆయన తండ్రి ఆ గుడిలోకి వెళ్లి మొక్కుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు వెళ్లారు.