anasuya: మోహన్ బాబు న్యూ మూవీలో యాంకర్ అనసూయ!

బుల్లితెరపై యాంకర్ అనసూయకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మరోపక్క నచ్చిన పాత్రలు వెతుక్కుంటూ వచ్చినప్పుడల్లా ఆమె వెండితెరపై మెరుస్తూనే వుంది. అలా క్షణం .. సోగ్గాడే చిన్నినాయనా .. విన్నర్ సినిమాల్లో సందడి చేసిన అనసూయ, ప్రస్తుతం చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో సినిమాను చేస్తోంది.

ఈ సినిమా తరువాత ఆమె మోహన్ బాబు సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టుగా సమాచారం. మోహన్ బాబు .. విష్ణు ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకి అనసూయ అయితేనే సరిగ్గా నప్పుతుందని ఆమెను సంప్రదించగా .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలతో పాటు, ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడనుంది.     
anasuya

More Telugu News