varun tej: 'ఫిదా'లో ఆ సీన్ దిల్ రాజు ఏరి కోరి పెట్టించాడట!

దర్శకుడు అడిగినవి సమకూర్చడంతో నిర్మాతగా తనపని పూర్తయినట్టని దిల్ రాజు ఎప్పుడూ అనుకోరు. ప్రతి విషయాన్ని ఆయన దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటూ వుంటారు. కథ .. కథనాల్లో అవసరమైన మార్పులు చెప్పడమే కాదు, ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా అవసరమైన చోట సీన్స్ ను ట్రిమ్ చేస్తుంటారు.

అలాంటి దిల్ రాజు 'ఫిదా'లో ఓ సీన్ ను శేఖర్ కమ్ములకి చెప్పి మరీ పెట్టించారట. ఈ సినిమా క్లైమాక్స్ లో భాగంగా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోను హత్తుకుపోతుంది. ఈ సీన్ నే దిల్ రాజు పెట్టించారు. ఈ సీన్ ఎంతో ఫీల్ తో కూడుకున్నదనీ, ఆడియన్స్ కి  బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారట. ఆయన మాటే నిజమైంది .. ఈ సీన్ కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం .  
varun tej
sai pallavi

More Telugu News