: కేపీహెచ్ బీ కాలనీలో దారుణం.. ప్లాస్టిక్ కవర్ బిగించుకుని, కార్ లో గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య!
హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ముఖానికి ప్లాస్లిక్ కవర్ చుట్టుకుని, ఆ తర్వాత కారులోని గ్యాస్ లీక్ చేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలేషియా టౌన్ షిప్ సమీపంలో జరిగిన ఈ ఘటన... ఈ ఉదయం వెలుగు చూసింది. పార్క్ చేసి ఉన్న కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో... స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులోని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతుడిని నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్ గా గుర్తించారు. కారులో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలం కావడం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.