: మిస్ పాకిస్థాన్ వరల్డ్ సంచలనం.. నగ్నంగా ఫొటో షూట్!
పాకిస్థాన్ కు చెందిన మిస్ పాకిస్థాన్ వరల్డ్ అంజలికా తాహిర్ నగ్న ఫొటో షూట్ చేసి, సంచలనం రేకెత్తించింది. ఈ అందాల సుందరి గతంలో పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఏకంగా మూడు అందాల సుందరి కిరీటాలు, నాలుగు అవార్డులు, ఒక గోల్డ్ మెడల్ సాధించింది. అంజలికా తండ్రి పాకిస్థానీ కాగా, తల్లి ఉక్రేనియన్. అంజలి జాతీయత పాకిస్థానీ అయినా, ఆమె ఉక్రెయిన్ లో ఉంటోంది. ఇప్పటికే పాక్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె, తాజా ఫొటో షూట్ తో పాకిస్థానీలను మత్తెక్కిస్తోంది. మరోవైపు, ఆమె నగ్న ఫొటో షూట్ విషయంపై మత ఛాందసులు విరుచుకుపడుతున్నారు.