: ప్రొద్దుటూరులో బీటెక్ విద్యార్థినిని గొంతు కోసి చంపిన దుండగులు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్ నగర్‌లో ఈ రోజు సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని పలువురు దుండగులు గొంతుకోసి హత్య చేశారు. స్థానికులు ఘటనాస్థలికి చేరుకునేలోపే దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. సదరు విద్యార్థిని ఇంట్లో ఆమె తప్ప ఎవరూలేరని తెలుసుకుని ప్రవేశించిన పలువురు దుండగులు కత్తులతో ఆమె గొంతు కోసి హత్య చేశారని పోలీసులు వివరించారు. హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని పేరు హైందవి అని తెలిపారు.