: కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు


సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బ్యాంకుల ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడంలో అర్థం లేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకనే ధర్నాలు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత, కరెంట్ కోతలు ఉన్నాయని, తమ హయాంలో రైతులు కోరిన విత్తనాలు, ఎరువులు ఇస్తున్నామని అన్నారు. గతంలో వ్యవసాయానికి 6 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 24 గంటల పాటూ విద్యుత్ ఇస్తోందని హరీశ్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News