puri jagannadh: 'జన గణ మన' చేసి తీరతానంటోన్న పూరీ జగన్నాథ్!

షార్ట్స్‌లో చూడండి
పూరీ జగన్నాథ్ కొంతకాలం క్రితం మహేశ్ బాబు కథానాయకుడిగా తాను 'జన గణ మన' సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. మహేశ్ బాబు లుక్ తో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అన్నాడు. అయితే వరుస సినిమాలతో మహేశ్ బిజీగా ఉండటం వలన .. పూరీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు.

మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి ఆయన ప్రస్తావించాడు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటోన్న పరిణామాల కారణంగా ఈ కథను తెరకెక్కించాలనే పట్టుదల తనలో మరింత పెరిగిందని ఆయన అన్నాడు. దేశంలో వున్న అనేక రకాల సమస్యలు ఈ స్క్రిప్ట్ లో చోటుచేసుకుంటాయని చెప్పాడు. 'ఐ లవ్ ఇండియా .. ఐ హేట్ ఇండియన్స్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ అనీ .. ఇలా ఎందుకు పెట్టాననేది ఈ సినిమా చూసిన తరువాత అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
puri jagannadh

More Telugu News