: ముమైత్‌ఖాన్, ఛార్మీ కూడా డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు అవుతారు: ఎక్సైజ్ శాఖ కమిషనర్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తోందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సుబ్బరాజుని సుదీర్ఘంగా విచారిస్తోన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నోటీసులు అందుకున్న ముమైత్‌ఖాన్, ఛార్మీ కూడా విచారణకు హాజరు అవుతారని అన్నారు. ఈ రోజు బయటపడిన పలు వివరాల గురించి విచారణ అనంతరం వివరిస్తామని తెలిపారు. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26న ఛార్మీ విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు పంపించారు. అలాగే ముమైత్‌ఖాన్‌కు కూడా నోటీసులు పంపించారు. ముమైత్ ఖాన్ ఏ రోజున విచారణకు హాజరుకావాల్సి ఉందో ఇంకా తెలియరాలేదు.