: తన మెసేజ్ లకు భర్త రిప్లై ఇవ్వడం లేదని విడాకులు కోరిన భార్య.... మంజూరు చేసిన కోర్టు!
మానవ సంబంధాలు పెను ప్రమాదంలో ఉన్నాయి. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, విలువ ఇవ్వడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కుటుంబ సంబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళ్తే... తైవాన్ కి చెందిన లిన్ తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కారణం, తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, సోషల్ మీడియా ద్వారా తాను పెట్టే మెసేజ్ లకు సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది.
దానిని పరిశీలించిన న్యాయస్థానం...లిన్ ను ఆమె భర్త నిర్లక్ష్యం చేస్తున్నారని, గత ఆరు నెలల్లో పలుమార్లు ఆయన ఇదే విధంగా ప్రవర్తించాడని, దీని వల్ల వారిద్దరూ ఒకే చూరుకింద ఉంటున్నప్పటికీ మాట్లాడుకోవడం లేదని, కనీసం ఆమె ప్రమాదానికి గురైన సమయంలో కూడా మెసేజ్ చూసినా స్పందించలేదని నిర్ధారించింది. అంతే కాకుండా తన తల్లిదండ్రులు, సోదరీమణులకు సేవలు చేయాలని తనను ఆదేశిస్తున్నాడని ఆమె పిటిషన్ లో చేసిన ఆరోపణలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది . వీటిని పరిశీలించిన న్యాయస్థానం వారి వాదనను అంగీకరిస్తూ వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.