yvs choudari: అచ్చొచ్చిన లవ్ స్టోరీతోనే రానున్న వైవీఎస్ చౌదరి!

ఇటు యూత్ ను .. అటు కుటుంబ కథా చిత్రాలతో ఆడియన్స్ ను మెప్పించిన దర్శకులలో వైవీఎస్ చౌదరి ఒకరు. ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రాలలో 'దేవదాసు' ఒకటి. రామ్ .. ఇలియానా జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఆయనకి ఘన విజయాన్ని అందించింది. రామ్ .. ఇలియానా కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.

 అలాంటి వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తీసుకున్నారు. కొన్ని సినిమాల నిర్మాణం కారణంగా ఆయనకి వచ్చిన నష్టాలే అందుకు కారణం. ఇప్పుడు మళ్లీ ఆయన తనకి అచ్చొచ్చిన ప్రేమకథనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావొచ్చిందని అంటున్నారు. కొత్త హీరో హీరోయిన్లతోనే ఈ సినిమా వుంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.   
yvs choudari

More Telugu News