gopichand: 'గౌతమ్ నంద'లో గోపీచంద్ కి మహేశ్ బాబు ఇంటిపేరు?

షార్ట్స్‌లో చూడండి
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా 'గౌతమ్ నంద' తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. సంపత్ నంది .. పవన్ కల్యాణ్ అభిమాని అనే సంగతి తెలిసిందే. అందువల్లనే 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ పాత్ర పేరైన 'గౌతమ్ నంద'ను ఈ సినిమాకి టైటిల్ గా పెట్టాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

ఇక తాజాగా మరో విషయం తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ ఇంటిపేరు 'ఘట్టమనేని' అట. ఇది సూపర్ స్టార్ కృష్ణ ఇంటి పేరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంటే గోపీచంద్ పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్ నంద అన్న మాట. మహేశ్ కొడుకు పేరు ఘట్టమనేని గౌతమ్ అనే సంగతి తెలిసిందే. మహేశ్ ఫ్యాన్స్ దృష్టిని కూడా ఈ సినిమా వైపు మళ్లించడానికే సంపత్ నంది తెలివిగా ఇలా ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
gopichand
hansika

More Telugu News