: డ్రగ్స్ కేసులో ఓ పత్రికాధిపతి... 15 మంది విలేకరులకూ పాత్ర?


టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డ్రగ్స్ దందాలో పారిశ్రామికవేత్తగా ఉన్న ఓ పత్రికాధిపతి పాత్ర కూడా ఉన్నట్టు సిట్ పోలీసులు గుర్తించారు. అందుకు తగ్గా సాక్ష్యాలను సంపాదించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. నిన్న శ్యాం కే నాయుడిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న వేళ, సదరు పత్రిక యజమాని పేరు బయటకు వచ్చినట్టు సమాచారం. ఆయన పలుమార్లు గోవాకు వెళ్లివచ్చారని, ఆయన్ను ఎందుకు ప్రశ్నించడం లేదని శ్యామ్ సిట్ పోలీసులను ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది.

ప్రాథమిక సాక్ష్యాలను సంపాదించిన తరువాత ఆయనకు నోటీసులు పంపి విచారించే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఇక కెల్విన్ తో పాటు అరెస్ట్ అయిన మరో డ్రగ్స్ వ్యాపారి పీయుష్ స్మార్ట్ ఫోన్ ను విశ్లేషించగా, వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న విలేకరులు, యాంకర్ల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పీయుష్ కు, వీరికి మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించేందుకు 15 మందికి సిట్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారంతా 24వ తేదీ నుంచి తమ ముందుకు రావాలని సిట్ ఆదేశించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News