ajith: 'వివేకం' టీజర్ భారీగా అంచనాలు పెంచేస్తోంది!

షార్ట్స్‌లో చూడండి
అజిత్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతుంటాయి. తాజాగా తమిళంలో ఆయన చేసిన 'వివేగం' సినిమాను 'వివేకం' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కులు 4.5 కోట్లకి అమ్ముడు కావడం విశేషం.

 తెలుగు వెర్షన్ కి సంబంధించి వదిలిన టీజర్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. "లోకం నిన్ను ఎదిరించినా .. పరిస్థితులు నువ్ ఓడిపోయావంటూ వెక్కిరించినా .. నువ్వుగా ఒప్పుకునేంత వరకూ ఎవరూ ..  ఎప్పుడూ .. ఎక్కడా నిన్ను గెలవలేరు" అనే వాయిస్ ఓవర్ పై ఈ టీజర్ కట్ చేశారు. ఫారిన్ లొకేషన్స్ .. ఛేజింగ్స్ .. యాక్షన్ సీన్స్ కట్టిపడేసేలా వున్నాయి. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల కానుంది.

      
Go Back to Shorts
ajith
kajal

More Telugu News