nithya menon: తెలుగు చిత్రపరిశ్రమను పొగుడుతున్న నిత్యామీనన్!

తెలుగు చిత్రపరిశ్రమను కొంతమంది కథానాయికలు విమర్శిస్తూ వుండటాన్ని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. కొంతమంది ఆ విమర్శలకు కట్టుబడి ఉంటే .. మరి కొంతమంది ఆ తరువాత సింపుల్ గా సారీ చెప్పేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను అభినందించిన కథానాయికలు కూడా లేకపోలేదు. అలాంటివారిలో తాజాగా నిత్యామీనన్ కూడా చేరిపోయింది.

 తమిళ .. మలయాళ భాషలతో పాటు తెలుగులోను నిత్యామీనన్ కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి నిత్యామీనన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమ ఎంతో గొప్పదని చెప్పింది. కొత్తవారిని ప్రోత్సహించడంలో తెలుగు చిత్రపరిశ్రమ ముందుంటుందని అంది. స్త్రీలను మర్యాదగా చూసుకోవడంలో తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ అని చెప్పుకొచ్చింది.        
nithya menon

More Telugu News