: మరో మెట్రో పిల్లర్ ప్రమాదం... కారు ఢీకొని ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు


హైదరాబాద్ లోని మెట్రో రైలు పిల్లర్ మరోమారు టెర్రర్ పిల్లర్ గా మారింది. ఈ ఉదయం ఐదుగురు ప్రయాణిస్తున్న ఓ కారు చైతన్యపురి వద్ద పిల్లర్ ను ఢీకొనగా, ఒకరు అక్కడికక్కడే మరణించారు. కారులోని మిగతా నలుగురికీ తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ పరిధిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసును నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News