: నాకు మందు కొట్టే అలవాటు లేదు!: రాజమౌళి
తనకు మందు కొట్టే అలవాటు లేదని, అందువల్లే తాగిన వారు ఆ సమయంలో ఎలా ఉంటారు? ఎలా ప్రవర్తిస్తారన్న విషయాలు తనకు తెలియవని దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించారు. నిన్న హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఓ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యూత్ సరదా కోసం డ్రింక్ చేసినా, ఆపై బైకులు, కార్లను మాత్రం తీయవద్దని ఆయన సలహా ఇచ్చారు. డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని, అవసరమైతే స్నేహితుల సహాయం తీసుకుని ఇళ్లకు చేరుకోవాలే తప్ప, సొంతంగా మాత్రం నడపవద్దని అన్నారు.
ఈ సందర్భంగా రహదారి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన వంటి అంశాలతో తయారు చేసిన వీడియోను పలు కాలేజీలకు చెందిన 3 వేల మంది విద్యార్థులకు చూపించి వారిలో అవగాహన కల్పించారు. ఒకరు చేసిన తప్పుతో కుటుంబం ఛిన్నాభిన్నం కాకుండా చూసుకోవాలంటూ పిలుపునిచ్చారు.