: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు.. క్లింటన్ నాకు ఐదు వందల కోట్ల డాలర్లు ఇస్తానన్నారు!


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై బాంబు పేల్చారు. పాక్ అణు పరీక్షలు నిర్వహించకుండా వుంటే, తనకు 5 బిలియన్ డాలర్లు ఆశ చూపారని ఆరోపించారు. అయితే తాను దేశానికి అత్యంత విధేయుడిని కావడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలిపారు. ఒకవేళ క్లింటన్ ఆఫర్‌ను కనుక తాను అంగీకరించి ఉంటే పాక్ అణ్వస్త్ర దేశం అయి ఉండేది కాదన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

1998లో బిల్ క్లింటన్ తనను కలిసి అణు పరీక్షలు నిలిపేయాలని కోరారన్నారు. అందుకోసం ఏకంగా 5 వందల కోట్ల డాలర్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారని, అయితే తాను ఎంతమాత్రమూ లొంగలేదన్నారు. అయితే ఆయన ఆరోపణలు పాక్ మీడియా అంతగా పట్టించుకోవడం లేదు. అవినీతి కేసుల్లో పీకల్లోతులో చిక్కుకుపోయిన ఆయన బయటపడేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతోంది.

  • Loading...

More Telugu News