: డ్రగ్స్ కేసులో ఛార్మీ విచారణ 26న ఉంటుంది!: ఎక్సైజ్ శాఖ
టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు హాజరుకావాల్సిన తేదీలు మారిపోయాయి. రేపు ఛార్మీని కాకుండా కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని విచారిస్తామని తాజాగా సిట్ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఛార్మీని ఏ తేదీన విచారిస్తామన్న అంశాన్ని కూడా అధికారులు తాజాగా ప్రకటించారు. ఛార్మీ ఈ నెల 26న విచారణకు రావాల్సి ఉంటుందని అన్నారు. మొదట్లో చెప్పిన ప్రకారం, ఈ నెల 26న నటుడు నవదీప్‌ను విచారించాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా అధికారులు ఈ తేదీల్లో మార్పులు చేశారు. ఈ రోజు పూరీ జగన్నాథ్‌ను విచారించిన అధికారులు మరికాసేపట్లో మీడియాతో వివరాలు తెలపనున్నారు.