: చార్మి పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్ డీలర్ కెల్విన్!
డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి, సిట్ అధికారుల విచారణలో పలు విషయాలు బయటపడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు డ్రగ్ డీలర్ కెల్విన్ తో పరిచయం, ఈవెంట్లు, పార్టీలు వంటి విషయాలపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి చార్మి పుట్టినరోజు వేడుకల్లో కెల్విన్ పాల్గొన్న విషయమై పూరీని ప్రశ్నించినట్టు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా అధికారులు చూపించినట్టు తెలుస్తోంది. కాగా, కెల్విన్ నుంచి పూరీ డ్రగ్స్ తీసుకున్నట్టు నలుగురు సభ్యుల సిట్ బృందం నిర్ధారణకు వచ్చారని సమాచారం.