: విచారణ సాఫీగా సాగుతోంది.. అన్ని విషయాలు రాబడుతున్నాం: ఎక్సైజ్ కమిషనర్
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఉదయం 10.30కు విచారణను ప్రారంభించిన అధికారులు మధ్యలో కొంత సమయం బ్రేక్ లు ఇస్తూ విచారణను కొనసాగిస్తున్నారు. మొదట కెల్విన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన పూరీకి అధికారులు పలు ఫొటోలు చూపించడంతో చివరకు ఆయన తెలుసని ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విచారణపై ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ... పూరీ జగన్నాథ్ విచారణ సాఫీగా సాగుతోందని అన్నారు. పూరీని లోతుగా విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పూరీ కొన్ని విషయాలు చెప్పారని, మరింత సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.