: అందుకే, అప్పుడు నా మంత్రి పదవి పోయింది: మాజీ మంత్రి శంకర్రావు


ఎర్రచందనం కేసులో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డి ప్రమేయం ఉందని నాడు కోర్టుకు వెళ్లినందుకే తన పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు గ్లోబల్ టెండర్లు పిలవకుండా అక్రమాలకు పాల్పడ్డారని, రూ.1,350 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారని నాడు కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. మన న్యాయస్థానాలు బాగా పనిచేస్తాయని అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఈ రోజు ఏపీకి ఎర్రచందనం ప్రధాన ఆదాయవనరుగా మారిందని అన్నారు.

  • Loading...

More Telugu News