: ఒకపక్క రుణమాఫీ కోసం రైతుల ధర్నా... మరోపక్క జీతాలు పెంచేసుకున్న ఎమ్మెల్యేలు.. తమిళనాడులో చోద్యం!
రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు చేస్తున్న ధర్నా ఆ ప్రజాప్రతినిధులకు పట్టలేదు. అసెంబ్లీలో వారి సమస్యలు పరిష్కరించడం మానేసి తమ జీతాన్ని రెట్టింపు చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం వారికి లభిస్తున్న జీతంలో పెంపు కావాలని ఏకంగా 100 శాతం పెంపును ప్రతిపాదిస్తూ తమిళనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేసుకున్నారు తమిళ ఎమ్మెల్యేలు. ఈ మేరకు బిల్లు ఆమోదం పొందినట్లు ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన కూడా చేశారు. ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ. 55000 చొప్పున జీతం అందేది. ఈ బిల్లు ఆమోదం వల్ల నెలకు రూ. 1.5 లక్షల జీతం పొందనున్నారు. ఇదిలా ఉంచితే, రుణమాఫీ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు రోజుకో రకంగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.