: ట్రాఫిక్ రూల్స్ విషయంలో నన్ను చూసి నా డ్రైవర్ కూడా మారాడు: అల్లు అర్జున్
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ట్రాఫిక్ పై యువతలో చైతన్యం తీసుకు వచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. హైదరాబాదులోని సత్యసాయి నిగమాగమం వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సుకు వీరు వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ప్రజల్లో ట్రాఫిక్ పై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలుసని, కానీ పాటించడం లేదని అన్నాడు. తాను మాత్రం ట్రాఫిక్ రూల్స్ ను పక్కాగా పాటిస్తానని... తాను పాటించే రూల్స్ ను చూసి తన డ్రైవర్ కూడా మారాడని తెలిపాడు. మద్యం తాగి వాహనం నడపరాదని, ట్రాఫిక్ లో హీరోయిజం చూపించరాదని ప్రజలకు విన్నవించాడు.