: సిట్ విచారణలో పూరి జగన్నాథ్ ఏం చెప్పాడంటే..?


డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నేడు సిట్ అధికారుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా సిట్ విచారణ బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే, పూరి మాత్రం ఏ మాత్రం తడబడకుండా సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పాడు. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్ లో కెల్విన్ ను కలిసిన విషయం నిజమేనని ఒప్పుకున్న పూరి... ఆ తర్వాత తనకు, కెల్విన్ కు మధ్య రెగ్యులర్ గా ఎలాంటి సంభాషణలు జరగలేదని చెప్పినట్టు సమాచారం. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశాడు. సిట్ అధికారుల ప్రశ్నలకు పూరి ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు ఇస్తుండటంతో... ముందుగానే విచారణకు పక్కా ప్లానింగ్ తో ఆయన వచ్చారని అంటున్నారు. ఇప్పటి వరకు 20 ప్రశ్నలకు పూరి సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News