: 'బిగ్ బాస్' షోలో తమాషా సీన్: అరుస్తూ, కరుస్తూ రెచ్చిపోయి బెంబేలెత్తించిన ఆదర్శ్... తోటి కంటెస్టెంట్లపై దాడి!


గత వారాంతంలో ప్రారంభమై, తెలుగు టీవీ ప్రేక్షకులకు మూడు రోజుల్లోనే దగ్గరైన వినూత్న 'బిగ్ బాస్' షోలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఇంట్లోకి వెళ్లిన ఆదర్శ్ మందు, మత్తు లేక పిచ్చెత్తినట్టు ప్రవర్తించాడు. తనను అదుపు చేయాలని చూసిన మధుప్రియ, సమీర్ తదితరులపై పెద్దగా అరుస్తూ దాడికి దిగాడు. తనకు విస్కీ కావాలని కేకలు పెట్టాడు. ఈ క్రమంలో ధనరాజ్ అతని వద్దకు వెళ్లగా, చెయ్యిని రక్తం వచ్చేలా కొరికేశాడు.

 ఆ తరువాత కాసేపటికి తనంతట తాను ఏడ్చాడు. ధనరాజ్ కు క్షమాపణలు చెప్పాడు. ఆపై ప్రిన్స్ తో కలసి లోపలికి వెళ్లాడు. కాసేపటికి బయటకు వచ్చి వస్తువులను విసిరి విసిరి పడేస్తూ, మిగతా వారిని బెంబేలెత్తించాడు. చివరికి అంతా కలసి అదేదో 'ప్రాంక్' అని అభిమానుల నుంచి ఓట్లు ఎక్కువ పడి, ముందుకు వెళ్లడానికి వేసిన ఎత్తన్నట్టుగా షోలో చూపించినా, మొత్తం వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తూ, తదుపరి ఎలా ఉంటుందన్న విషయమై ఆసక్తిని పెంచుతోంది.

  • Loading...

More Telugu News