: అమ్మానాన్నాల వద్దకు వెళ్లనంటున్న పూర్ణిమా సాయి భవిష్యత్తుపై కోర్టు నిర్ణయమే కీలకం!
గత నెల 7వ తేదీన సినిమాలపై ఆశతో ఇంటి నుంచి పారిపోయి, ముంబైలో ప్రత్యక్షమైన పూర్ణిమా సాయి అలియాస్ అనికా శ్రీ భవిష్యత్తును నేడు జువైనల్ కోర్టు నిర్ణయించనుంది. గత రాత్రి ఆమెను ముంబై నుంచి తీసుకువచ్చిన పోలీసులు, నేడు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్న పూర్ణిమ భవిష్యత్తుపై కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.
వాస్తవానికి బాలిక మైనర్ కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, కౌన్సెలింగ్ ఇచ్చి వారి వద్దకే పంపాలని కోర్టు ఆదేశించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ పాప అమ్మా నాన్నలతో వెళ్లేందుకు ససేమిరా అంటే, చైల్డ్ వెల్ఫేర్ బోర్డు అధీనంలోని ఓ హాస్టల్ లో తాత్కాలికంగా ఉంచవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పూర్ణిమ హైదరాబాద్, నింబోలి అడ్డలోని ప్రభుత్వ బాలికల ప్రత్యేక గృహంలో పర్యవేక్షణాధికారి సంరక్షణలో ఉంది.