: బ్రిటన్ టీవీ స్టార్ క్లోహితో దుర్భర జీవితం గడిపానంటున్న బాయ్ ఫ్రెండ్!
బ్రిటన్ టీవీ స్టార్ క్లోహి ఫెరీపై ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ స్కాట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆమె పచ్చి సైకో అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆమెతో తాను గడిపిన ఆరు నెలలు చాలా దుర్భరంగా గడచిపోయాయని, తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పాడు. మార్టి మెక్ కెన్నాతో ఆమె సన్నిహితంగా గడపుతుండటంతో, తాను ఆమెతో అనుబంధాన్ని కొనసాగించడం కష్టంగా మారిందని చెప్పాడు. మెక్ కెన్నాతో గడపడమే కాకుండా, మాజీ ప్రియులతో కూడా ఆమె సన్నిహితంగా గడుపుతుండటంతో, ఆమెతో తాను విడిపోయానని తెలిపాడు. క్లోహి, స్కాట్ లు ఇద్దరు 'ఎక్స్ ఆన్ ద బీచ్' షోలో ముఖాముఖి మాట్లాడబోతున్నారు.