: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నంలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి యశ్వంత్ (18) అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటవల వెలువడిన ఫలితాల్లో బీటెక్ సెకండ్ సెమిస్టర్‌లో యశ్వంత్ రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేని కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఈ ఘటనకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గుర్తించి తోటి విద్యార్థులు ఈ విషయాన్ని కాలేజీ యజమాన్యానికి చెప్పారు. వెంటనే వారంతా కలిసి యశ్వంత్‌ను ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.