rajanikanth: రికార్డు స్థాయిలో రజనీ సాంగ్ షూటింగ్!

షార్ట్స్‌లో చూడండి
రజనీకాంత్ '2.0' సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. మరో వైపున పెండింగ్ లో వున్న ఒక్క పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో రజనీ .. ఎమీ జాక్సన్ కాంబినేషన్లో, తనదైన శైలిలో శంకర్ ఈ సాంగ్ ను తెరకెక్కించనున్నారు.

ఇండోర్లో వేసిన భారీ సెట్లో చాలా గ్రాండ్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సాంగ్ కి భారీ గ్రాఫిక్స్ వర్క్ ను జత చేయనున్నారట. దాదాపు 12 రోజుల పాటు నిర్విరామంగా ఈ సాంగ్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ ఏ సాంగ్ ను కూడా ఇన్ని రోజుల పాటు నిర్విరామంగా చిత్రీకరించలేదట. అందువలన ఈ రికార్డు కూడా రజనీ ఖాతాలోకే వెళ్లనుందని అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    
Go Back to Shorts
rajanikanth
amy jackson

More Telugu News