: ‘బాహుబలి’లో శివగామి పాత్రపై దర్శకుడు కృష్ణవంశీ ఏమన్నారంటే..!
‘బాహుబలి’లో శివగామి పాత్ర పోషించిన నటి రమ్యకృష్ణకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పాత్రపై రమ్యకృష్ణ భర్త, దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబలి’ చిత్రంలో రమ్యకృష్ణ నటన చాలా బాగుందని, అయితే, ఆ పాత్ర అంతగా రాణించడానికి, ప్రశంసలు పొందడానికి ఆ చిత్ర రచయిత, దర్శకుడే కారణమని అన్నారు. ఆ క్యారెక్టర్ ను రచయిత చాలా బాగా రాశారని అన్నారు. కాగా, ‘అమ్మోరు’, ‘నరసింహ’ చిత్రాల్లో రమ్యకృష్ణ నటనాపరంగా నిరూపించుకుందని అన్నారు. అయితే, తమ బంధం వ్యక్తిగతమైంది కనుక, ఆమెను ఓ ఆర్టిస్టుగా చూడలేనని, రమ్యకృష్ణను తాను డైరెక్ట్ చేయలేనని కృష్ణవంశీ ఇటీవలే చెప్పారు.