: పార్టీ ఫిరాయింపు కేసులో అఖిలప్రియ సహా నలుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీకి షాక్ తగిలింది. ఏపీ మంత్రులు నలుగురికి ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలోకి జంప్ అయి ఇప్పుడు మంత్రిపదవులు అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సదరు న్యాయస్థానం ఆ నలుగురు మంత్రులకి నోటీసులు పంపించింది. దీనిపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవిస్తోన్న నేతల తీరును నిరసిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.