: సినీరంగంలోకి రకుల్ సోదరుడు అమన్!
`బ్యూటీ విత్ బ్రెయిన్` అనే కొటేషన్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి బాగా సరిపోతుంది. అటు ఫిట్‌నెస్ బిజినెస్‌లోనూ, ఇటు తెర మీదా దూసుకెళ్తున్న రకుల్ తాజాగా తన సోదరుణ్ని సినీరంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి విజయం సాధించింది. త్వరలోనే ఆమె సోదరుడు అమన్ `రాక్ ఎన్ రోల్` అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విషయాన్ని రకుల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. `ఆల్ ద బెస్ట్.. మై లిటిల్ బ్రదర్.. ఇది నీకు మొదటి మెట్టే.` అంటూ తన సోదరుని సినిమాను ప్రమోట్ చేయడానికి రకుల్ బాగానే కష్టపడుతోంది. `ఏ స్టోరీ ఆఫ్ సెక్స్, గన్స్ అండ్ బంచ్ ఆఫ్ ఇడియట్స్` అనే క్యాప్షన్ ఉన్న అమన్ సినిమా ఫస్ట్‌లుక్‌ను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.