charan: 'నేను లోకల్' డైరెక్టర్ తో చరణ్ చర్చలు!

కథ కొత్తగా వుండాలి .. కథనం ఆసక్తికరంగా ఉండాలి .. టేకింగ్ లో తనదైన మార్క్ ను చూపించగలగాలి. అలా చేస్తే హిట్ ను దోసిట్లో పెట్టి అందించడానికి ఆడియన్స్ ఎంతమాత్రం ఆలోచించరు. 'నేను లోకల్' మూవీతో అలా విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడే త్రినాథరావు నక్కిన.

'నేను లోకల్' హిట్ తరువాత ఆ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను అందించిన ప్రసన్న కుమార్ ను మరో కథ రెడీ చేయమని త్రినాథరావు చెప్పాడట. చరణ్ ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేసిన ఆ కథను .. ఆల్రెడీ చరణ్ కి వినిపించారట. చరణ్ కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పి అవి సరిచేసుకుని రమ్మని చెప్పాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ తో చరణ్ ను మెప్పిస్తే, కొరటాల శివ ప్రాజెక్టు తరువాత ఆయన ఈ సినిమా చేయవచ్చని చెప్పుకుంటున్నారు.  
charan

More Telugu News