: బుచ్చయ్య చౌదరిని అడ్డుకున్న పోలీసులు, ఉండవల్లి అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు!


పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చ పేరిట తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లు సవాళ్లను విసురుకుని, విజయవాడ ప్రకాశం బ్యారేజీపై తలపెట్టిన చర్చను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారేజీపై చర్చకు అనుమతించాలని గోరంట్ల లిఖితపూర్వకంగా పోలీసులను కోరగా, అందుకు అనుమతించే ప్రసక్తే లేదని ఆయనకు ఫ్యాక్స్ ద్వారా సమాచారాన్ని పంపించిన పోలీసులు, ఈ ఉదయం బ్యారేజీ వద్దకు బయలుదేరిన ఆయనను అడ్డుకున్నారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడకు చేరుకుని, బ్యారేజ్ వద్దకు రాగా, ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులను భారీగా మోహరించి, అక్కడికి ఎవరూ చేరకుండా చూస్తున్నారు. ఈ ఘటనతో సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News