gopichand: సంపత్ నందికి చరణ్ నుంచి పిలుపు వచ్చేనా?

దర్శకుడు సంపత్ నంది గతంలో చరణ్ కథానాయకుడిగా చేసిన 'రచ్చ' మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించింది. ఆ తరువాత చరణ్ తో మరో సినిమా చేయడానికి సంపత్ నంది ప్రయత్నించాడు. చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడు. అయితే చరణ్ వరుస కమిట్ మెంట్స్ తో ఉండటం వలన, వెంటనే సంపత్ నందికి ఛాన్స్ ఇవ్వలేకపోయాడు.

ఇక ప్రస్తుతం సంపత్ నంది .. గోపీచంద్ తో 'గౌతమ్ నంద' సినిమా చేశాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ బయటికి వచ్చిన తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో సంపత్ నందికి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా హిట్ కొడితే తనకి చరణ్ నుంచి పిలుపు రావొచ్చని సంపత్ నంది అనుకుంటున్నాడు. అలా జరుగుతుందేమో చూడాలి మరి.    
gopichand
hansika

More Telugu News