: సిట్ పోలీసులకు ముమైత్ ఖాన్ చిక్కడం లేదట!


తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మాదకద్రవ్యాల దందాలో ప్రధాన పాత్రధారి కెల్విన్ ఫోన్ లోని సమాచారాన్ని అనుసరించి, పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందించిన సిట్ పోలీసులు, ఐటమ్ సాంగ్ హాట్ బాంబ్ ముమైత్ ఖాన్ జాడను మాత్రం ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారు. తొలి జాబితాలో ఒక్క ముమైత్ కు మాత్రమే ఇంకా నోటీసులు జారీ కాలేదని తెలుస్తోంది. ఆమె చిరునామా విషయంలో స్పష్టత లేదని, హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో ఆమె ఉంటోందని తెలుసుకుని అక్కడికి వెళితే, ఆమె లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి.

 ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ముంబైకి వెళ్లిన వారు కూడా వెనక్కు వచ్చేశారు. ప్రస్తుతం ముమైత్ ఖాన్, పుణెలోని లోనావాలా ప్రాంతంలోని ఓ ఇంటిలో జరుగుతున్న టీవీ షోలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు రేపు లేదా ఎల్లుండి ఇద్దరు కానిస్టేబుళ్లను అక్కడికి పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ముమైత్ ఖాన్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రయోక్తగా ఉన్న 'బిగ్ బాస్'షోలో పార్టిసిపెంట్ గా పాల్గొంటున్నదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News