: చంద్రబాబుకి మోదీ ఫోన్.. వెంకయ్య గెలుపు బాధ్యతను అప్పజెప్పిన ప్రధాని


ఎన్డీఏ త‌మ ఉప‌రాష్ట్రపతి అభ్య‌ర్థిగా వెంక‌య్య నాయుడిని ఎంపిక చేసిన అనంతరం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఫోన్ చేసి మ‌ద్ద‌తు కోరిన విష‌యం తెలిసిందే. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కూడా ప్ర‌ధాని మోదీ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య నాయుడిని ఎంపిక చేశామ‌ని చెప్పిన మోదీ.. వెంక‌య్య విజ‌యానికి ఎన్డీఏ క‌న్వీన‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని కోరారు. దీనిప‌ట్ల‌ చంద్ర‌బాబు నాయుడి స్పంద‌న గురించి తెలియాల్సి ఉంది. కాగా, ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య నాయుడిని ఎంపిక చేయ‌డం ప‌ట్ల ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు కేంద్ర మంత్రులు, బీజేపీ నేత‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.  

  • Loading...

More Telugu News