: విశేషంగా ఆకట్టుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త లుక్ చూడండి!


బాహుబలి పార్ట్ 1, పార్ట్‌ 2 సినిమాల‌ కోసం దాదాపు ఐదు సంవ‌త్స‌రాల స‌మ‌యం కేటాయించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం సాహో సినిమా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భాస్ ఎప్పుడూ క‌నిపించ‌ని విధంగా, కొత్త‌లుక్‌లో క‌నిపించ‌నున్నాడని టాక్‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు సంబంధించిన ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌రికొత్త హెయిర్ స్టైల్‌తో కొత్త లుక్‌తో ఆయ‌న ఈ లేటెస్ట్ ఫొటోలో క‌న‌ప‌డుతున్నాడు. సాహోలో ప్ర‌భాస్‌లుక్ ఇదేనా? అంటూ ఆయ‌న అభిమానుల్లో చ‌ర్చ మొద‌లైంది. కాగా, ఓ మ్యాగజైన్ కోసం ప్రభాస్ ఈ ఫొటో దిగాడని మరికొందరు అంటున్నారు. ఏమైనా, ఈ కొత్త‌లుక్‌లో త‌న అభిమానుల‌కు ఆక‌ట్టుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News