: వెంకయ్య నాయుడికి ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు పేరును భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడికి ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎంతో సమర్థవంతమైన నాయకుడైన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయడం తెలుగు ప్రజలు హర్షించతగిన విషయమని వ్యాఖ్యానించారు. వెంకయ్యకు అన్ని పార్టీలూ మద్దతు పలుకుతాయని పేర్కొన్నారు.