: యాపిల్ తొక్క తీస్తూ వేగంగా బస్సు నడిపిన డ్రైవర్.. వణికిపోయిన ప్రయాణికులు.. మీరూ చూడండి!
ప్రయాణికుల క్షేమాన్ని గాల్లో వదిలేస్తూ కొందరు డ్రైవర్లు ప్రవర్తిస్తోన్న తీరు విస్మయం కలిగిస్తోంది. రహదారిపై బస్సు డ్రైవర్లు పోటీలు పడుతూ దూసుకెళ్లడం, నిద్రమత్తులో ఊగుతూ ఓ డ్రైవర్ బస్సు నడిపించడం వంటి ఘటనలు ఇటీవలే వార్తల్లోకెక్కాయి. ఈ సారి ఓ డ్రైవర్ వేగంగా బస్సు నడుపుతూ యాపిల్ పండుపై ఉండే తొక్కను తీయడం... తర్వాత పండు తినడం చేశాడు.
ఆ డ్రైవర్ చర్యకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చైనాలోని తైజౌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఆ డ్రైవర్ యాపిల్ పండు తొక్క తీస్తూ పక్కనే ఉన్న బకెట్‌లో వేస్తున్నాడు. యాపిల్ తింటూనే బస్సును వేగంగా నడుపుతున్నాడు. ఇక అందులోని ప్రయాణికులు భయపడిపోయారు. ఆ బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలను చూసిన సంబంధిత అధికారులు
ఆ డ్రైవర్‌ను తొలగించి, లైసెన్స్ రద్దు చేశారు. ఈ వీడియోను మీరూ చూడండి...