dil raju: ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దిల్ రాజు బ్యానర్ పై 'శ్రీనివాస కల్యాణం'!

నిర్మాతగా దిల్ రాజుకి గల అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. యూత్ కి ..  మాస్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి .. ఇలా ఏయే వర్గాలకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయనేది ఆయనకి బాగా తెలుసు. అందువలన ఆ తరహా సినిమాలను అందిస్తూ ఆయన సక్సెస్ ను సాధిస్తున్నారు.

అలా 'శతమానం భవతి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టిన ఆయన, 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ తో మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేయించారు. 'శతమానం భవతి' సినిమాతో హిట్ ఇచ్చిన సతీశ్ వేగేశ్న .. ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను ఆరంభించే ఆలోచనలో వున్నారు.     
dil raju

More Telugu News